
అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
జన్నారం: తన రేంజ్ పరిధిలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు సిబ్బందితో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఇందన్‌పల్లి రేంజ్ అధికారి శ్రీధరచారి అన్నారు. ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ కలప స్మగ్లింగ్‌పై దృష్టి సారిస్తానన్నారు. ఇసుక అక్రమ రావాణా అరికట్టడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో అడవులు అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ అధికారిగా బాధ్యతలు..
ఇందన్‌పల్లి రేంజ్ ఇన్‌చార్జి అధికారిగా విధులు నిర్వహించిన కారం శ్రీనివాస్ ఆదివారం తిరిగి జిల్లా టాస్క్‌ఫోర్స్ రేంజ్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. జన్నారంలోనే హెడ్‌క్వార్టర్‌గా ఉండాలని జిల్లా అటవీ సంరక్షణ అధికారి శివ్ ఆశిష్ సింగ్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.