
హ్యాండ్‌బాల్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన హ్యాండ్ బాల్ క్రీడాకారిణి పులిశెట్టి శృతి పటియాలలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో హ్యాండ్ బాల్ సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసిందని హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌రావు, కనపర్తి రమేశ్ తెలిపారు. శృతి మూడు సీనియర్ నేషనల్‌లో, రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ఒక బంగారు పతకం సాధించిందని పేర్కొన్నారు. కర్రసా ములోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బంగారు పతకాలు సాధించిందని వెల్లడించా రు. ఆదివారం శృతిని అభినందించారు. అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్, కోశాధికారి అలుగువెల్లి రమేశ్‌రెడ్డి, కోచ్ సువర్కర్ అరవింద్ పాల్గొన్నారు.