
యువతి అదృశ్యం
తానూరు:మండలకేంద్రం పరిధి లో ఆదివారం యు వతి అదృశ్య ం కాగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలి పా రు. మ హారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన సాక్రే అంకిత (18) అనే యువతి మూడు నెలలుగా హి ప్నెల్లి గ్రామంలో వరుసకు చిన్నాన్న అయ్యే శివకుమార్ ఇంట్లో ఉంటోంది. ఆదివారం శివకుమార్ కుటుంబసభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లారు. చేను వద్ద కలుపు మొక్కలు తీసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంకిత తిరిగి రాలేదు. చుట్టుపక్కల, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో శివకుమార్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ ఒకరు మృతి
భైంసాటౌన్: పట్టణంలోని నర్సింహానగర్‌కు చెందిన కల్యాణ్‌కర్ శంకర్ (45) అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంకర్ ఇటీవల ఇంటిపై నుంచి మెట్లు దిగుతూ జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలవగా కుటుంబీకులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.