
మెడికల్ బోర్డుపై మంత్రికి వినతి
శ్రీరాంపూర్: సింగరేణిలో జబ్బుపడిన కార్మికుల కో సం ప్రతీనెల స మావేశమయ్యే మె డికల్ బోర్డు ఆరు నెలలుగా జరగడం లేదని యూ త్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తోకల సురేశ్ తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఆదివారం వినతిపత్రం అందించారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. హయ్యర్ సెంటర్ రెఫరల్ అయిన కార్మికులైతే డ్యూటీలు లేక వేతనాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఓసీపీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు 80 శాతం స్థానికులకే ఇవ్వాలని విన్నవించారు. దీనిపై కంపెనీ అధికారులతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు సురేశ్ తెలిపారు.