
యూరియా కోసం బారులు
నార్నూర్: మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు, మహిళలు బారులు తీరారు. 20 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో ఆదివారం ఉదయం 5 గంటలకు వారు తరలివచ్చారు. మండలానికి 300 మెట్రక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 100 మెట్రిక్ టన్నులు వచ్చిందని, సోమవారం మరో 50 మెట్రిక్ టన్నులు వస్తుందని సీఈవో అడే గణేశ్ తెలిపారు. సొసైటీ కేంద్రంలో ఉన్న 400 బ్యాగులు ముందు వరుసలో ఉన్నవారికే దొరికాయి. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి సరిపడా ఎరువులు అందించాలని కోరుతున్నారు.

యూరియా కోసం బారులు