
ఆదివాసీ భవన్ ధ్వంసం
కెరమెరి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని కుమురం భీం ఆదివాసీ భవన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గేటుతోపాటు భవన్ తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి స్టేజీ టైల్స్ ఇతర వాటిని తొలగించారు. విద్యుత్ వైర్లు, బోర్డును అపహరించారు. ఆదివారం సమావేశం ఏర్పాటు చేద్దామని వెళ్లిన ఆదివాసీ నాయకులకు ఇలా కనిపించింది. ప్రశాంతంగా ఉన్న కెరమెరి మండలంలో ఈ చర్యలతో అలజడి ఉత్పన్నమయ్యో అవకాశం ఉంది. ఏదైన ఉంటే ముఖాముఖి తేల్చుకోవాలే తప్ప ఇలాంటి చేష్టలకు పాల్పడవద్దని వారు పేర్కొంటున్నారు. ఆకతాయిలు చేశారా? లేదా పెద్దలు వెనకుండి పక్కా ప్లాన్‌తో ఈ తతంగం నడిపించారా అనే అనుమానాలు ఆదివాసీలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.