ఎస్టీపీపీలో ‘మహా’ బృందం పర్యటన
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థ ర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్ బృందం బుధవారం రాత్రి పర్యటించింది. ఎస్టీపీపీలో లిక్విడ్ నేచురల్ గ్యాస్ లేదా నేచురల్ గ్యాస్ వినియోగానికి కావాల్సిన సదుపాయాలు, ఇతర సౌకర్యాలపై అధ్యయనం చేశారు. నేచురల్ గ్యాస్ ను ఇంధనంగా వాడకం వల్ల కర్భన ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. బాయిలర్‌లో రెండు యూనిట్లను పరిశీలించి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. జీఎం(ఓసీపీఎస్) డీవీఎ స్‌ఎన్.రాజు, జీఎం శ్రీనివాసులు, వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, ఏజీఎంలు శివప్రసాద్, మురళీధర్, మదన్‌మోహన్ పాల్గొన్నారు.


