
చైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణ
జైపూర్: ప్రజల్లో చైతన్యం, అవగాహన ద్వా రానే అడవులు, ప్లాంటేషన్లలో అగ్నిప్రమాదా ల నివారణ పూర్తిగా సాధ్యమవుతుందని తె లంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్‌కుమార్ తెలిపారు. అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని ముదిగుంట శివారులోగల నీలగిరి ప్లాంటేషన్‌లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. వేసవిలో ప్లాంటేషన్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలు ఎలా ఆర్పాలో స్థానికులకు వివరించారు. బ్లోయర్లతో మంటలు ఎలా నియంత్రించాలో సూచించారు. ప్లాంటేషన్, అటవీప్రాంతాల మీదుగా వెళ్లేవారు బీడీలు, సిగరెట్లు తాగి ఆర్పకుండా పడేయవద్దని తెలిపారు. కాగజ్‌నగర్, బెల్లంపల్లి రేంజ్ ప్లాంటేషన్ల మేనేజర్లు లక్ష్మణ్, సునీత, ఫీల్డ్ సూపర్‌వైజర్లు రాజేశ్, శ్రీనివాస్, వాచర్లు, సిబ్బంది శంకర్, సాయికిరణ్, లచ్చన్న, రాకేశ్, ఓదెలు పాల్గొన్నారు.
అవగాహన కల్పిస్తున్న అధికారులు