
నలుగురికి కమిషనర్లుగా పదోన్నతి
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీల్లో వివిధ వి భాగాల అధికారులకు కమిషనర్లుగా పదోన్న తి కల్పిస్తూ సీడీఎంఏ డైరక్టర్ శ్రీదేవి శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన నలుగురికి మున్సిపల్ కమిషనర్లుగా పదో న్నతి లభించింది. మంచిర్యాల కార్పొరేషన్ మేనేజర్ కె.విజయ్‌కుమార్, సానిటరీ సూపర్‌వైజర్ రాజమనోహర్, మందమర్రి మున్సి పల్ మేనేజర్ నాగరాజు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ కమిషనర్లుగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం వీరికి ఏ మున్సిపాలిటీని కే టాయించకపోయినా, త్వరలోనే వివిధ ము న్సిపాలిటీలకు కమిషనర్లుగా వెళ్లనున్నారు.