
మద్యపానం బహిరంగమే..!
మంచిర్యాలక్రైం: బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై పోలీసులు నిషేధం విధిస్తున్నా ఎక్కడా అమలు కు నోచుకోవడం లేదు. శనివారం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ వైన్‌షాపు వద్ద రైల్వేట్రాక్ పక్కన ఓ యువకుడు బహిరంగంగానే మద్యం సేవిస్తూ కనిపించాడు. పట్టపగలే ఓ వైన్స్‌షాపులో కొందరు యువకులు మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చి గొడవ పడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదనే ఉద్దేశంతో ఎకై ్సజ్ శా ఖ ఉన్నతాధికారులు మద్యం దుకాణంతోపాటు సి ట్టింగ్‌కు అనుమతి ఇస్తున్నారు. కానీ కొందరు మ ద్యంప్రియులు రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారు. మంచిర్యాలలో రాత్రి 9గంటలు దాటితే చాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరి సమీపంలో, హైటెక్ సిటీ, ఏసీ సీ క్వారీ రోడ్, గ్రీన్ సిటీ, తిలక్‌నగర్, రాజీవ్‌నగర్, హైటెక్ సిటీ క్లబ్ సమీపంలో మందుబాబులకు అ డ్డాగా మారాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానా న్ని పోలీసులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మద్యపానం బహిరంగమే..!

మద్యపానం బహిరంగమే..!