
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● జెడ్పీ సీఈవో గణపతి ● ఎంపీడీవో, ఎంపీవో, సూపరింటెండెంట్‌కు నోటీసులు
మందమర్రిరూరల్: విధుల నిర్వహణపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జెడ్పీ సీఈవో గణపతి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో రాజేశ్వర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందే విధంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం, సంక్షేమ ఫలాల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఉదయం 10గంటలకు కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంపీడీవో, ఎంపీవోతోపాటు సిబ్బంది కూడా లేరు. దీంతో సమయపాలన పాటించలేదని ఎంపీడీవో, ఎంపీవో, ఆఫీస్ సూపరింటెండెంట్, ఎనిమిది మంది ఆఫీస్ సిబ్బందితోపాటు ఉపాధి హామీ సిబ్బందికి జెడ్పీ సీఈవో గణపతి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.