లక్ష్మణచాంద: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌రూరల్ మండలంలోని మూటాపూర్ గ్రామానికి చెందిన పులి పెద్దన్న (32)కు నిర్మల్ శాంతినగర్‌కు చెందిన లక్ష్మితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొన్ని రో జులుగా భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య లక్ష్మి తల్లి గారింటికి వెళ్లిపోయింది. ఈనెల 21న పెద్దన్న తన భా ర్యను తీసుకురావడానికి వెళ్లగా భార్య లక్ష్మి, ఆమె బంధువులు కలిసి పెద్దన్నపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పెద్దన్న సరస్వతి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మండలంలోని రాచాపూర్ సమీపంలోని సరస్వతి కాలువలో మృతదేహం లభ్యమైంది. పెద్దన్న తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలి పారు.
ఉరేసుకుని ఒకరు..
నర్సాపూర్ (జి): మండల కేంద్రానికి చెందిన తోకల సాయన్న అలియాస్ భోజన్న మద్యం మత్తులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల మేరకు.. నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన తోకల సాయన్న అలియాస్ భోజన్న (55) స్థానిక జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 35 సంవత్సరాలుగా తాత్కాలిక అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల నుంచి పనికి వెళ్లడం మానేసి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంటి వెనకాల గల రేకుల షెడ్డులో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయన్న కుమారుడు తోకల వంశీరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.