ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఎకరాల్లో, విత్తనాలు, ఎరువులు, రుణాలు | - | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఎకరాల్లో, విత్తనాలు, ఎరువులు, రుణాలు

Apr 21 2025 8:11 AM | Updated on Apr 21 2025 8:11 AM

ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఎకరాల్లో, విత్తనాలు, ఎరువులు, ర

ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఎకరాల్లో, విత్తనాలు, ఎరువులు, ర

పప్పు దినుసుల

సాగుకు ప్రోత్సాహం..

రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులకు అవగా హన సదస్సులు నిర్వహిస్తాం. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు ప్రణాళిక రూపొందించడం జరిగింది. పత్తి విత్తనాలు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలి. తప్పని సరిగా రశీదు తీసుకోవాలి. నాణ్యత లేని, హెచ్‌టీ పత్తి వి త్తనాలు కొనుగోలు చేసి నష్టపోవద్దు. కలు పు నివారణ కోసం గ్లైఫొసెట్‌ పిచికారీ చే యడం వలన భూసారం దెబ్బతింటుంది. రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

– జి.కల్పన, జిల్లా వ్యవసాయ అధికారి

నెన్నెలలో వేసవి దుక్కులు దున్నుతున్న రైతు

ఇతర విత్తనాలు

32,324 క్వింటాళ్లు

పత్తి విత్తనాలు

3,40,306 ప్యాకెట్లు

సాగు విస్తీర్ణం

3,33,565 ఎకరాలు

మంచిర్యాలఅగ్రిల్చర్‌: మరో నెలలో వానాకాలం పంటల సీజన్‌ ప్రారంభం కానుంది. యాసంగి పంటలు పూర్తయిన రైతులు ఇప్పటికే చేలను చదును చేస్తున్నారు. వేసవి దుక్కులు సిద్ధం చేసుకుంటున్నా రు. దీంతో వ్యవసాయ శాఖ వానాకాలం సాగు కోసం యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించింది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువుల ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాది ఆలస్య వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

సకాలంలో వానలు..

గతేడాది ఖరీఫ్‌లో ఆలస్యంగా వర్షాలు కురవడంతో రైతులు ప్రారంభంలో ఇబ్బందులు పడ్డారు. ఆలస్యంగా కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు సాధరణ స్థాయికి చేరాయి. దీంతో సాగు విస్తీర్ణం సాధరణ స్థాయికి చేరింది. ఈయేడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. రైతులు వానకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు.

సాగు విస్తీర్ణం, విత్తనాల ప్రణాళిక

గతేడాది వానాకాలంలో జిల్లాలో 3.18 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది 3.33 లక్షల ఎకరాలకు సాగు పెరుగుతుందని అంచనా. ఇందులో పత్తి (1.58 లక్షల ఎకరాలు), వరి (1.58 లక్షల ఎకరాలు), కందులు, మొక్కజొన్న, పెసలు, మినుములతో సహా ఇతర పంటల సాగు ప్లాన్‌ రూపొందింది. పత్తి కోసం 3.40 లక్షల ప్యాకెట్లు, వరి కోసం 23,790 క్వింటాళ్ల విత్తనాలు అవసరం. సేంద్రియ ఎరువులైన జిలుగ, జనుము విత్తనాలపై ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. యూరియా (43,952 మెట్రిక్‌ టన్నులు), డీఏపీ (13,306 మెట్రిక్‌ టన్నులు) ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రుణ లక్ష్యం, రైతుల సమస్యలు

ఈ ఏడాది రూ.2,242 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించారు. గతేడాది కంటే రూ.250 కోట్లు అధికం. అయితే, గతేడాది రూ.1,346 కోట్లు మాత్రమే అందిన నేపథ్యంలో, సకాలంలో రుణాలు అందకపోతే రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి ఉంది. రబీ దిగుబడి ఆలస్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘రైతు భరోసా’ పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల సహాయం సకాలంలో అందితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వ రాయితీ విత్తనాలు

45,424 క్వింటాళ్లు (జీలుగ, జనుము)

ఎరువులు :

1,10,205 మెట్రిక్‌ టన్నులు

రుణ లక్ష్యం : రూ.1951.25 కోట్లు

ప్రణాళిక రూపొందించిన వ్యవసాయ శాఖ

విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు

పత్తి, వరి సాగే ప్రధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement