
ఆర్టీసీ సర్వర్ డౌన్.. నిలిచిన బస్సులు
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ మంచిర్యాల డిపోలో ఆదివారం సాంకేతిక లోపం కారణంగా సర్వర్ డౌన్ అయింది. దీంతో బస్సుల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. ఉదయం 3:45 నుంచి 8:30 గంటల వరకు పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులతో సహా 74 బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. దీంతో బస్‌స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాంకేతిక లోపం ఎందుకు?
హైదరాబాద్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులకు సంబంధించిన డ్రైవర్, కండక్టర్లు టిమ్ లోడింగ్‌కు డిపోకు వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత సిస్టమ్‌లో (కంప్యూటర్)లో కండక్టర్, డ్రైవర్, టిమ్ నంబర్ నమోదు చేయాల్సిన చోట వివరాలు నమోదు కాలేదు. టిమ్ లోడింగ్ చేస్తేనే టిక్కెటు ఇష్యూ అవుతుంది. (సాంకేతిక లోపం)తో ఫైల్ కరెఫ్ట్ (ఎర్రర్) రావటంతో టిమ్ లోడింగ్ కాలేదు. అయితే, సర్వర్ లోపంతో ఫైల్ కరప్ట్ కావడంతో టిమ్ లోడింగ్ విఫలమైంది. సిస్టమ్ ఇన్‌చార్జి వీక్లీ ఆఫ్‌లో ఉన్నప్పటికీ సమస్య తీవ్రత దృష్ట్యా డిపోకు వచ్చారు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ అనలైజర్ తప్పనిసరి అనడంతో వివాదం చెలరేగింది. తన డ్యూటీ కాకపోయినా సంస్థ కోసం విధులకు హాజరైతే బ్రీత్ ఎన్‌లైజర్ పేరుతో అవమానిస్తారా అని ఇన్‌చార్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి బ్రీత్ అనలైజర్‌కు నిరాకరించడంతో సమస్య పరిష్కారం ఆలస్యమైంది. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో ఉదయం 9 గంటలకు సమస్య పరిష్కరించడంతో బస్సులు రాకపోకలు ప్రారంభమయ్యాయి.
డిపోలో అనిశ్చితి
మంచిర్యాల డిపోలో ఇటీవల విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం డిపో కార్యాల య తాళాలు సెక్యూరిటీ కార్యాలయం నుంచి మా యమయ్యాయి. శనివారం ఉదయం తాళాలు లేని విషయం తెలిసి, తలుపులు కట్టర్‌తో కట్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి రావచ్చు. ఈ సంఘటనలు ఆర్టీసీ డిపోలో సమన్వయ లోపాన్ని, ప్రయాణికులకు ఇబ్బందులను తెలియజేస్తున్నాయి.
పరిష్కారం కోసం చర్యలు
సాంకేతిక లోపాలను త్వరగా గుర్తించి పరిష్కరించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. సిబ్బంది మధ్య సమన్వయం, సెక్యూరిటీ విధానాల సమీక్ష అవసరం. ప్రయాణికుల సౌకర్యం కోసం డిపో నిర్వహణలో సమర్థత పెంచాలి.
మూడు గంటలకుపైగా ఆలస్యం..
ఇబ్బంది పడ్డ ప్రయాణికులు

ఆర్టీసీ సర్వర్ డౌన్.. నిలిచిన బస్సులు