నిర్మల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌నగర్ కాలనీకి చెందిన చవాన్ కరణ్‌సింగ్ (22) మంగళవారం అదే కాలనీకి చెందిన స్నేహితులు సయ్యద్ అజీమ్, నర్సింగ్‌తో కలిసి బైక్‌పై సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయ సమీపంలోకి రాగానే టిప్పర్‌ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి ముగ్గురూ కిందపడిపోయారు. కరణ్‌సింగ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సయ్యద్ అజీమ్, నర్సింగ్‌ను 108లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.