ఆత్మకూర్: మండలంలోని మూలమల్ల గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన ఎడ్లబండ్ల గిరక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఉమ్మడి మహాబూబ్‌నగర్‌లోని 18 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. నారాయణపేట జిల్లాకు చెందిన రంగన్న ఎద్దులు మొదటి బహుమతి సాధించగా దేశాయిపద్మాజారెడ్డి రూ.20 వేలు నగదు అందజేశారు. గద్వాల జిల్లాకు చెందిన ధర్మరెడ్డి ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలువగా సర్పంచ్ రంగారెడ్డి రూ.15 వేలు బహుమతి అందజేశారు. మూడో విజేత గంగన్నపల్లికి చెందిన ధరెప్పకు ఉపసర్పంచ్ అశోక్ రూ.10 వేలు నాలుగో విజేత వనపర్తి రైతు లోకపతిరాజుకు మునిస్వామి రూ.5 వేలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వహకులు ఆనంద్‌గౌడ్, ఆనంద్‌రెడ్డి, మల్లికార్జున్, రవికుమార్, రాజు, గ్రామస్తులు, రైతులు పాల్గోన్నారు.


