నకిలీ డ్రగ్స్‌ కట్టడికి బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ విధానం | - | Sakshi
Sakshi News home page

నకిలీ డ్రగ్స్‌ కట్టడికి బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ విధానం

Mar 28 2026 10:32 AM | Updated on Mar 28 2026 10:32 AM

పాలమూరు: మెడికల్‌ దుకాణాల్లో నకిలీ డ్రగ్స్‌ కట్టడి కోసం బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్‌కుమార్‌ వెల్లడించారు. మార్కెట్‌లో డ్రగ్స్‌ శాంపిళ్లను సేకరించిన తర్వాత వాటిలో నకిలీలు, ప్రమాణాలు పాటించని మందులు ఉంటే దీనితో గుర్తించవచ్చునని తెలిపారు. డ్రగ్‌ డీలర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారుల సెల్‌ఫోన్లకు ఈ సమాచారం బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల్లో పంపిస్తుందని తెలిపారు. అప్పటికే డీలర్‌ నుంచి హోల్‌సెల్‌, రిటైల్‌కు చేరి ఉంటూ వెంటనే ఆ బ్యాచ్‌ మందులను వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, దీంతో నకిలీ డ్రగ్స్‌ రోగులకు చేరకముందే అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. నకిలీ మందుల పట్ల రోగులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సందేహం వస్తే, మందుల పాకెట్‌లపై క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే మందుల తయారీ ప్రాంతం, తేదీ, ఇతర వివరాలు కన్పిస్తాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement