పోలీసుల తనిఖీల్లో నగదు పట్టివేత
● బుద్దారంలో రూ..1.95 లక్షలు
● గండేడ్ మండలంలో రూ.1.45 లక్షలు స్వాధీనం
మహమ్మదాబాద్/గోపాల్‌పేట: ఎన్నికల నిబంధనల్లో బాగంగా గురువారం ఎన్నికల అధికారులు ప్‌లైయింగ్ స్క్వా డ్ తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్రవాహనదారుడి నుంచి రూ.1.45 లక్షలు లభించాయి. గండేడ్ మండలం రెడ్డిపల్లి గేటు దగ్గర గురువారం ఫ్‌లైయింగ్‌స్క్వాడ్ తనిఖీలు చేయగా హన్వాడ మండలంలోని కొగట్టుపల్లికి చెందిన ఇప్పాలపల్లి వెంకటయ్య రూ1.45క్షలు తీసుకుని కోస్గివైపు వెళుతున్నాడు. ఇదే సమయంలో ఎన్నికల అధికారులు తనిఖీలు చేయగా డబ్బు నగదుతో పట్టుబడ్డాడు. సదరు వ్యక్తి తీసుకెళుతున్న నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని మహమ్మదాబాద్ పోలీసులకు అప్పగించినట్టు అధికారి లక్ష్మణ్ తెలిపారు.
బుద్దారం చెక్‌పోస్టు వద్ద..
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని బుద్దారం చెక్‌పోస్టు వద్ద గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.1.94 లక్షలు పట్టుకున్నామని గోపాల్‌పేట ఎస్‌ఐ నరేష్‌కుమార్‌తెలిపారు. ఇద్దరు బిజినేపల్లి నుంచి అప్పాయిపల్లికి, ఒకరు బిజినేపల్లి నుంచి ఎర్రవల్లికి డబ్బు తీసుకువెళుతుండగా పట్టుకుని సీజ్ చేశామని పేర్కొన్నారు.


