మధ్యాహ్న భోజనం బాలేదని.. విద్యార్థుల ఆందోళన
మహమ్మదాబాద్: మధ్యాహ్న భోజనం నాసిరకంగా అందిస్తున్నారంటూ మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు తినడంతో అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనం చేయకుండా రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అక్కడకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను పలుమార్లు మండల అధికారులకు విన్నవించినా ఫలితం లేదని.. స్వచ్ఛమైన తాగునీటిని కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు వివరించా రు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయాన్ని అధికారులకు తెలియజేసి నాణ్యమైన భోజనం అందించే ఏర్పాట్లు చేస్తామని పోలీసులు సర్దిచెప్పి పాఠశాలకు పంపించారు.


