ఉత్సాహంగాహ్యాండ్‌బాల్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగాహ్యాండ్‌బాల్‌ ఎంపికలు

Dec 3 2025 9:46 AM | Updated on Dec 3 2025 9:46 AM

ఉత్సా

ఉత్సాహంగాహ్యాండ్‌బాల్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 విభాగం హ్యాండ్‌బాల్‌ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి వేణుగోపాల్‌ తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి 14 వరకు జిల్లాకేంద్రంలో రాష్ట్రస్థాయి అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రజనికాంత్‌రెడ్డి, జియావుద్దీన్‌, శంకర్‌, ఆసిఫ్‌, ప్రదీప్‌, బాలు, అర్చన తదితరులు పాల్గొన్నారు.

పీజీ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో పరిధిలో చదువుతున్న పీజీ రెండు, మూడు సెమిస్టర్‌లకు బ్యాక్‌ లాగ్‌, రెగ్యులర్‌, మూడో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు విడుదల చేశారు. ఫలితాలను పాలమూరు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్‌ ప్రవీణ, అనురాధా, చంద్రకిరణ్‌, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

బాదేపల్లిలో నిలిచిన

క్రయవిక్రయాలు

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సోమవారం దాదాపు 21 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు రావడంతో యార్డు ఆవరణ పూర్తిగా నిండిపోయింది. కొనుగోలు చేసిన బస్తాలను వ్యాపారులు సకాలంలో తరలించకపోవడంతో యార్డులోనే ఎక్కడికక్కడ ఉండిపోయాయి. దీంతో మంగళవారం యార్డులో క్రయవిక్రయాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

● దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,692, కనిష్టంగా రూ.2500 ధర పలికింది. మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.కాగా.. బుధవారం ఉదయం ఉల్లి పాయల బహిరంగ వేలం నిర్వహించనున్నారు.

ఎస్‌హెచ్‌వీఆర్‌కు 8 పాఠశాలల ఎంపిక

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ రేటింగ్‌ స్కీం(ఎస్‌హెచ్‌వీఆర్‌)కు సంబంధించి జిల్లాస్థాయిలో 8 పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన జాబితాను డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. పాఠశాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి వసతి, టాయ్‌లెట్లు, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాల ఆధారంగా ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ను అధికారులు కేటాయించారు.. రూరల్‌–1 విభాగంలో కొంరెడ్డిపల్లి మండల పరిషత్‌ పాఠశాల, కంచన్‌పల్లి మండల పరిషత్‌ పాఠశాల, కల్లేపల్లి మండల పరిషత్‌ పాఠశాల, విభాగం–2లో ఎస్వీకేఎం పోలేపల్లి సెజ్‌, జెడ్పీ హెచ్‌ఎస్‌ వెన్నచేడ్‌ (బాయ్స్‌), జెడ్పీహెచ్‌ఎస్‌ తాటికొండ, అర్బన్‌ విభాగం–1లో బాదేపల్లి మండలపరిషత్‌ పాఠశాల, విభాగం–2లో అర్బన్‌ పాఠశాల జెడ్పీహెచ్‌ఎస్‌ ఎదిర ఉన్నాయి. జిల్లాస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1,136 దరఖాస్తులు చేసుకోగా అందులో 343 పాఠశాలలను అధికారులు ప్రత్యక్షంగా తనిఖీలు చేసి, 8 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ రాష్ట్ర స్థాయిలో ఎంపికై జాతీయ స్థాయిలో సత్తా చాటితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రూ.లక్ష క్యాష్‌ ప్రైజ్‌ను అందజేయనున్నారు.

ఉత్సాహంగాహ్యాండ్‌బాల్‌ ఎంపికలు 
1
1/1

ఉత్సాహంగాహ్యాండ్‌బాల్‌ ఎంపికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement