సమస్యాత్మక గ్రామంగా హన్వాడ
మహబూబ్‌నగర్ క్రైం/హన్వాడ: సమస్యాత్మక గ్రామంగా హన్వాడను గుర్తించామని, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగేటట్లు పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మంగళవారం హన్వాడల రైతువేదికలో జరుగుతున్న రెండో విడత నామినేషన్‌ల ప్రక్రియను పరిశీలించారు. అలాగే పోలింగ్ కేంద్రాల పరిసరాలతో పాటు బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. మండలకేంద్రంలో భద్రత ఏర్పాట్లు, బందోబస్తు కట్టుదిట్టంగా ఉండేలా అవసరమైన మార్గదర్శకాలను సూచించారు. ఆమె వెంట రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ వెంకటేష్ , ఇతర సిబ్బంది ఉన్నారు.
సైబర్ నేరాల కట్టడికి ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్
సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడి కోసం రాష్ట్ర పోలీస్‌శాఖ కీలక చర్యల్లో భాగంగా ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకు కొత్తరూపం మార్చుకుంటూ బాధితులను ఆర్థికంగా నష్టం చేకూర్చుతున్నారని తెలిపారు. ఒక్క క్లిక్‌తో పెద్ద నష్టం చోటుచోసుకోవచ్చునని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రత నియమాలను పాటించాలన్నారు. అనుమానాస్పద లింకులు, తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను, బ్యాంకింగ్ వివరాలు అడిగే ఫోన్‌కాల్స్‌కు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సైబర్ నేరాల బారినపడినప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌తో పాటు సైబర్ క్రైం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం సైబర్ నేరాల కట్టడి కోసం ప్రత్యేక ప్రతిజ్ఞ నిర్వహించారు.
నేటి నుంచి ‘మూడో’ విడత
● 5 మండలాల్లో 133 పంచాయతీలు, 1152 వార్డుల్లో నామినేషన్ల స్వీకరణ
● 5వ తేదీ వరకు అవకాశం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడుత నామినేషన్ల ఘట్టం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో అడ్డాకుల, ముసాపేట, భూత్పూర్, బాలానగర్, జడ్చర్ల మండలాల పరిధిలోని 133 గ్రామ పంచాయతీలకు, 1152 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 38 క్లస్టర్ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం స్టేజి–1 ఆర్‌ఓలు 44 మంది, స్టేజ్–1 ఏఆర్‌ఓలను 43, స్టేజ్–2 ఆర్‌ఓలను 145 మంది సిబ్బందిని నియమించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది.
పరిశీలన
నామినేషన్లు
సమస్యాత్మక గ్రామంగా హన్వాడ


