పీఓలపైనే ఎన్నికల నిర్వహణ బాధ్యతలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్‌లో మీటింగ్ హాల్‌లో, జెడ్పీ మీటింగ్ హాల్‌లో పీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో అనేక దశల్లో అధికారులు పనిచేసినా, క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర ప్రిసైడింగ్ అధికారులదేనని చెప్పారు. కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు అధికారులు తప్పకుండా సమయానికి హాజరై, సంబంధిత గ్రామ పంచాయతీకి సంబంధించిన స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను అప్రమత్తం సంప్రదించాలన్నారు. వారికి కేటాయించిన ఎలక్షన్ మెటీరియల్‌ను సక్రమంగా తనిఖీ చేసి, బ్యాలెట్ పేపర్లలో తమ ప్రిసైడింగ్ స్టేషన్‌కు సంబంధించిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక, ధ్రువపత్రాల జారీ వంటి కార్యక్రమాలు అన్నీ స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ప్రిసైడింగ్ అధికారులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్ర పరిధిని గుర్తించటం, అభ్యర్థుల వివరాలను ప్రదర్శించడం, పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేయడం పూర్తిగా ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత అని వివరించారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీపీఓ నిఖిత, తదితరులు పాల్గొన్నారు.
మూడో విడతకు వెబెక్స్ ద్వారా శిక్షణ..
మూడోదశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. మంగళవారం స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులకు వెబెక్స్ ద్వారా శిక్షణ నిర్వహించారు. నామినేషన్ వివరాలను టీ–పోల్ సాఫ్ట్‌వేర్‌లో వెంటనే అప్‌లోడ్ చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఆర్‌ఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లకు నామినేషన్లు వచ్చిన వెంటనే టీ పోల్ లో నమోదు చేయాలని స్పష్టంగా ఆదేశించారు. నామినేషన్ పత్రాల ప్రాథమిక ఽధ్రువీకరణను కచ్చితంగా చేయాలని, నామినేషన్ రద్దు, గుర్తుల కేటా యింపు వంటి కీలక నిర్ణయాల్లో ఎన్నికల రూల్ బుక్ అనుసరించాలన్నారు.
శిక్షణ


