హాట్‌స్పాట్ కేంద్రాల్లో అదనపు బందోబస్తు
మహబూబ్‌నగర్ క్రైం: సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించడం వల్ల ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోగలుగుతారని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం గాజులపేట, జమిస్తాపూర్, ధర్మపూర్ గ్రామాల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన వీధులతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పోలీసులు తిరుగుతూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సమస్యాత్మకంగా గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి బీట్ పెట్రోలింగ్ బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఇంటింటికి భద్రతతో పాటు డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఽఘా పెట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో బెదిరింపులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ విజయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
● స్థానిక ఎన్నికల్లో ఎలాంటి గొడవలు సృష్టించరాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ ఎన్‌బీ రత్నం కోరారు. కోయిలకొండ మండలపరిధిలో ఉన్న 8 ప్రధాన సమస్యాత్మక గ్రామాల్లో మంగళవారం అదనపు ఎస్పీ కోయిలకొండ ఎస్‌ఐ తిరుపాజీతో కలిసి పర్యటించారు. ప్రతి గ్రామంలో స్థానికులతో ఎలాంటి గొడవలు సృష్టించాం అనే అంశంపై ప్రతిజ్ఞ చేయించారు. బూర్గులపల్లి, తన్నాయిపల్లి, కోత్లాబాద్, పారుపల్లి, శెరివెంకటాపూర్, సూరారం, ఇంజమూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
ఫ్లాగ్‌మార్చ్


