150 గ్రాముల గంజాయి పట్టివేత
గద్వాల క్రైం: గుట్టుగా గంజాయి తరలిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకుని బైక్‌తో పాటు 150 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు గద్వాల ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్‌కు చెందిన అవీజ్ సోమవారం ఉదయం బైక్‌పై గద్వాలకు గంజాయి విక్రేయించేందుకు వస్తున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు ధరూర్ మండలం చిన్నచింతరేవుల గ్రామ శివారులో నిందితుడిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా 150 గ్రాముల గంజాయి పట్టుబడిందన్నారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేశామని, హైదరాబాద్ నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. గంజాయి తీసుకునే వారి వివరాలపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు. నిందితుడిని గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటేష్, వీరేశలింగం, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


