నెట్టెంపాడు నీటి పంపింగ్ ప్రారంభం
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిదిలో ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్టు–1 గుడ్డెందొడ్డి పంప్‌హౌస్ వద్ద నీటి పంపింగ్‌ను సోమవారం ప్రారంభించారు. సోమవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 1,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ఆవిరి రూపంలో 48 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోలతకు 750 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 390 క్యూసెక్కులు, కుడి కాలువకు 260 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1,448క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.624 టీఎంసీల నిల్వ ఉంది.


