రెండోరోజు భారీగా నామినేషన్లు
● సర్పంచ్‌కు 340.. వార్డులకు 1,007 దాఖలు
● నేటితో ముగియనున్న రెండో విడత
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతకు సంబంధించి రెండో రోజు సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిలకొండ, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని 151 గ్రామపంచాయతీలు, 1,334 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌లకు రెండోరోజు 340, వార్డులకు 1,007 నామినేషన్లు వచ్చాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్‌కు 476, వార్డులకు 1,165 నామినేషన్లు వచ్చాయి. కాగా.. మూడో విడతకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
రెండోరోజు భారీగా నామినేషన్లు


