మొదలైన రెండో విడత
● 6 మండలాల్లో 151
పంచాయతీలు, 1,334
వార్డులకు ఎన్నికలు
● తొలిరోజే సర్పంచ్‌కి 136..
వార్డులకు 158 నామినేషన్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడతలో హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిల్‌కొండ, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని 151 గ్రామ పంచాయతీలు, 1,334 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే తొలిరోజే సర్పంచులకు 136, వార్డు స్థానాలకు 158 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 2న సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండగా.. 3న స్క్రూట్నీ ఉంటుంది. 4న సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ల తిరస్కరణపై అభ్యర్థులు అప్పీలుకు వెళ్లవచ్చు. 6న మధ్యహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ తర్వాత అదేరోజు పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. 14న పోలింగ్ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.


