రిజర్వేషన్లలో తారుమారు
మానవపాడు: మూడో విడతలో జరుగనున్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మండలంలోని చెన్నిపాడుకు, గోకులపాడుకు సంబంధించి ఈ నెల 23న గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలో ఆర్డీఓ విడుదల జేసిన జాబితాలో చెన్నిపాడుకు జనరల్ కేటాయించగా శనివారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాబితాలో బీసీ జనరల్‌గా ఉంది. అదే విధంగా గోకులపాడుకు జనరల్ కేటాయించగా ప్రస్తుతం జనరల్ మహిళ అని అధికారులు నోటీసు బోర్డులో జాబితా ఉంచి అనంతరం తొలగించారు. దీంతో ఆయా గ్రామాల్లోని అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నట్లు పేర్కొంటున్నారు. గతంలో విడుదల చేసిన జాబితాకు ప్రస్తుతం ఉన్న జాబితాలో మార్పులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ రాఘవను సాక్షి వివరణ కోరగా.. చెన్నిపాడు జనరల్, గోకులపాడు జనరల్ మహిళకు రిజర్వుడ్ అయినట్లు పేర్కొన్నారు.
● గతంలో జనరల్.. ప్రస్తుతం జనరల్ మహిళ
● గందరగోళానికి గురవుతున్న అభ్యర్థుల
రిజర్వేషన్లలో తారుమారు


