ఎన్నికల నియమావళిపై అవగాహన ఉండాలి
● సాధారణ ఎన్నికల పరిశీలకురాలుకాత్యాయనీదేవి
గండేడ్/మహమ్మదాబాద్: జీపీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయ నీదేవి పేర్కొన్నారు. శుక్రవారం గండేడ్, మహమ్మదాబాద్ మండలంల్లో నామినేషన్ క్లస్టర్లు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియపై ఆరా తీశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల అన్ని వివరాలతో నామినేషన్లు తీసుకోవాలని, వారికి తగిన సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులు సిబ్బంది అన్నిరకాలుగా సహకరించాలని సూచించారు. ఓటింగ్ గదులు, స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు రకాల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిభందనల మేరకు పోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ ఎన్నికల నియమావళి ప్రకారమే కొనసాగాలన్నారు. ఆమెవెంట ఎంపీడీఓలు మంజుల, రేందర్‌రెడ్డి తహసీల్దార్ మల్లికార్జునరావు, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.


