వనపర్తి : అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు..
జిల్లా కాంగ్రెస్‌లో నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరడం.. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరంగా తన వర్గానికి సముచిత స్థానం దక్కకపోవడంపై చిన్నారెడ్డి కినుకు వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డిని ప్రకటించిన తర్వాత పార్టీ, ముఖ్య నేతల తీరు పట్ల ఆయన మనోవేదనకు గురై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తన ఇంట్లోనే 2018 నుంచి కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం కొనసాగుతుండగా.. బోర్డు తీసేసి పక్కకు వేయించారు. ఆ తర్వాత అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం నెలకొంది. మరో వైపు వనపర్తిలో మంగళవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డిని ప్రకటించిన తర్వాత జరిగిన కార్యక్రమానికి ఆయనతో పాటు చిన్నారెడ్డి హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా శివసేనారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. తనకు ఆహ్వానం ఉందని, బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాలేదని వెల్లడించారు. అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతామని చెప్పారు.
1980లో యువజన కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన ఇప్పటివరకు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ వంటి బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఆయనకు పేరుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వనపర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్‌ను మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన శివసేనారెడ్డి ఆశించారు. పెద్దమందడి ఎంపీపీగా ఉన్న తూడి మేఘారెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఎమ్మెల్యే టికెట్ లొల్లి తారస్థాయికి చేరింది. తొలుత ‘హస్తం’ అధిష్టానం చిన్నారెడ్డి పేరు ప్రకటించినా.. చివరలో మేఘారెడ్డికే బీఫాం ఇచ్చింది. అధిష్టానం నచ్చజెప్పడంతో చిన్నారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత క్రమంలో ఇరువురి మధ్య ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. తన వర్గానికి చెందిన వారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ చిన్నారెడ్డి తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని, గన్‌మెన్లను ఉపసంహరించుకున్నారు.
తాజాగా రాజుకున్న చిచ్చు..
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇటు మేఘారెడ్డి, అటు చిన్నారెడ్డి నేరుగా దరఖాస్తు చేసుకోలేదు. కానీ మేఘారెడ్డి తన వర్గానికి చెందిన లక్కాకుల సతీష్.. చిన్నారెడ్డి తన అనుచరుడైన డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కోసం యత్నించారు. అధిష్టానం ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఉన్న శివసేనారెడ్డిని ఎంపిక చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో చిచ్చు రాజుకున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
బోర్డుఎత్తివేయడంతో..


