డీపీఓగా జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అఽధికారిగా జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు కలెక్టర్ విజయేందిర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న డీపీఓ నిఖిల గ్రూప్–1 నుంచి డైరెక్ట్‌గా రావడంతో ఎన్నికల నిర్వహణపై అనుభవం లేకపోవడంతో ట్రెయినీ డీపీఓగా కొనసాగనున్నారు. వెంకట్‌రెడ్డి స్థానిక సంస్థల ఇన్‌చార్జి అడిషనల్ కలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆర్‌అండ్‌బీ ఈఈగా సంధ్య
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రోడ్లు భవనా ల శాఖ ఈఈగా సంధ్య నియమితులయ్యారు. గురువారం కలెక్టర్ విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈమె దేవరకద్ర డీఈ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈఈ గా ఉన్న దేశ్యానాయక్ బదిలీ కావడంతో పూర్తిస్తాయి ఇన్‌చార్జి ఈఈగా సంధ్యను నియమించడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేయాలని టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్ కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 28 మంది ఉద్యోగులు గురువారం కోర్టుకు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తమపై కేసులు ఉండడం దుర్మర్గమని అన్నా రు. ఉద్యోగ ఉద్యమకారులను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలికలు చదువుపైదృష్టి సారించాలి
పాలమూరు: అమ్మాయిలకు బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలు తల్లిదండ్రులు తెలుసుకోవాలని, బాలికలు చదువులపై ప్రత్యే క దృష్టి సారించాలని డీడబ్ల్యూఓ జరీనా బేగం అన్నారు. మహిళ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో నగరంలోని ఏనుగొండ కేజీబీవీ జాతీయస్థాయి బాల్య వివాహాల వ్యతిరేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు ఎవరితో పంచుకోవద్దన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ చిన్న వయసులో జరిగే పెళ్లి వల్ల బాలికల శరీర, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కౌమార దశలో గర్భధారణ వస్తే ప్రాణాలకు ముప్పు ఉంటుందని, శిశువుల అవయవాల ఎదుగుదలలో కూడా సమస్యలు వస్తాయని తెలిపారు. ఆకర్షణలకు లోనై చిన్న వయసులో వివాహాలు చేసుకోరాదన్నారు. పుస్తకాలతో పాటు సమాజంపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందించారు. సఖి కో–ఆర్డినేటర్ సౌజన్య, సీడీపీఓలు, చైల్డ్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
డీపీఓగా జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి


