పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
● సాధారణ ఎన్నికల పరిశీలకురాలుకాత్యాయనీదేవి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు, సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనీదేవి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేందిర బోయి, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్‌బాబుతో కలిసి నోడల్ అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో ఆబ్జర్వర్‌లు, వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు నియమించిన స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, పీఓ, ఏపీఓలకు నిర్దేశిత సమయం ప్రకారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రీవెన్స్‌సెల్ ద్వారా ఎన్నికల నియమావళి అమలులో వచ్చే ఫిర్యాదులు పరిష్కారం చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రి మండలాలు, గ్రామాలకు చేరిందా ఆరా తీశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాలకు రూట్ల వారీగా పోలింగ్ సిబ్బంది, సామగ్రి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. అభ్యర్థుల ఎన్నికలల్లో ప్రచార వ్యయం పర్యవేక్షణకు సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు తగిన రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు.
● కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ మొదటి విడ త గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఎన్నిక ల ప్రవర్తన నియమావళి అమలు, ఇతర నివేదికలను ఎప్పటికప్పుడు టీపోల్ ద్వారా పంపిస్తున్నా మని తెలిపారు. సూక్ష్మ పరిశీలకుల నియామకానికి సంబంధించిన వివరాలను, పోలింగ్ కేంద్రాలు, సౌకర్యాలు తదితర వివరాలను వివరించారు.


