త్రియుండ్ పర్వత శిఖరానికి సాహస విద్యార్థులు
గద్వాలటౌన్: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపికై న అధికారి, విద్యార్థి బృందం త్రియుండ్ పర్వత శిఖరానికి చేరకున్నారు. ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ అధికారి భాస్కర్, విద్యార్థి వీరేశ్‌నాయక్ జాతీయ సాహన శిక్షణ శిబిరానికి ఎంపికై న విషయం తెలిసిందే. సాహస శిక్షణ శిబిరంలో వీరు అనేక సాహస కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అందులో భా గంగా బుధవారం 2,875 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో ఉన్న త్రియుండ్ పర్వత శిఖారాన్ని ట్రెక్కింగ్ చేస్తూ చేరుకున్నారు. సాహోసోపేతమైన శిక్షణలో పాల్గొన్న విద్యార్థి, అధ్యాపకుడిని ప్రిన్సిపాల్ షేక్‌కలందర్‌బాషా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో సాహస యాత్రను విజయవంతం చేయాలని ఆకాక్షించారు.
నిలిచిన విద్యుదుత్పత్తి
ధరూరు: జెన్‌కో జలవిద్యుత్ కేంద్రం ఒక యూనిట్‌లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తిని నీటి కొరత కారణంగా నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టుకు బుధవారం రాత్రి 8గంటల వరకు కేవలం వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు తెలిపారు. ఆవిరి రూపంలో 48 క్యూసెక్కులు, కుడి కాల్వకు 416క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 464 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.624 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.


