జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
నర్వ: మండలంలోని రాయికోడ్ గ్రామానికి చెందిన విద్యార్థిని టి.అర్చన జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై నట్లు విశ్రాంత పీఈటీ గోపాలం తెలిపారు. గ్రామానికి చెందిన కీ.శే వెంకటయ్య, అంజమ్మ దంపతుల కుమార్తె అర్చనను 2018లో విశ్రాంత పీఈటీ గోపాలం చేరదీసి వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో మెరుగైన శిక్షణ అందించారు. దీంతో అర్చన తొమ్మిది క్రీడాంశాల్లో మెరుగైన శిక్షణ పొంది హకీంపేట క్రీడా పాఠశాలకు ఎంపికై ంది. అక్కడ నాలుగో తరగతిలో ప్రవేశం పొంది వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ సంపత్‌కుమార్ పర్యవేక్షణలో 2022 నుంచి 2024 వరకు రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 48 కేజీలు, 53 కేజీలు, 58 కేజీల విభాగంలో ప్రతిభ చాటి ప్రశంసాపత్రాన్ని పొందిందన్నారు. ప్రస్తుతం హకీంపేట క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతూ.. ఈ నెల 2న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో 63 కేజీలు ఎత్తి జాతీయ స్థాయికి ఎంపికై ందని, ఈ నెల 26 నుంచి 30 వరకు అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో జరిగే జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్లినట్లు గోపాలం పేర్కొన్నారు. ఈ విద్యార్థిని అక్క అనూష సైతం గోపాలం దగ్గరే శిక్షణ పొంది సైక్లింగ్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించింది. క్రీడారంగంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు రాణిస్తూ బంగారు పథకాలను సాధించడంపై రాయికోడ్ గ్రామస్తులు, నర్వ మండల క్రీడాభిమానులు వారిని అభినందించారు.
అర్చన


