అంతా సిద్ధం..
● నేటి నుంచి తొలి విడత నామినేషన్లు
● 40 క్లస్టర్ జీపీల్లో ఏర్పాట్లు
సాక్షి ప్రతినిది, మహబూబ్‌నగర్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలు కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలివిడతలో జిల్లాలోని గండేడ్, మహబూబ్‌నగర్ రూరల్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్ మండలాల పరిధిలో 139 గ్రామపంచాయతీ స్థానాల్లో సర్పంచ్‌లు.. 1,188 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకనుగుణంగా ఆయా జీపీలను 40 క్లస్టర్లుగా విభజించి నామినేషన్లు స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
● తొలి విడతలో 40 క్లస్టర్ల పరిధిలో నామినేషన్ల స్వీకరణ కోసం స్టేజి–1 ఆర్‌ఓలు 48 మంది, స్టేజి–1 ఏఆర్‌ఓలను 48, స్టేజి–2 ఆర్‌ఓలను 157 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరు వారికి కేటాయించిన క్లస్టర్లలో అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
అంతా సిద్ధం..


