పాలమూరులో విద్యారంగం మరింత అభివృద్ధి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మంగళవారం పీయూలో రూ.15 కోట్లతో లా కళాశాల, రూ.35కోట్లతో ఇంజి నీరింగ్ కళాశాల, రూ.25కోట్లతో నిర్మించనున్న బా లుర, బాలికల హాస్టళ్ల భవనాలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీసీ శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలమూరులో కొత్తగా జిల్లాలు ఏర్పడినప్పటికీ పాలమూరు ఐదు జిల్లాలకు కేంద్రంగా ఉందని, ఇక్కడ అభివృద్ధి జరిగితే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు చదువుకునేందుకు వెసలుబాటు ఉంటుందన్నారు. పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుతో పీయూ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. కొత్త కళాశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, ఉన్న తంగా వారిని తీర్చిదిద్దాలని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీయూతో ఎంపీ, తనకు ఎన్నోఏళ్ల అనుబంధం ఉందని, నిధులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయించామని, లా, ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.100కోట్ల నిధులు విడుదల చేసేందుకు తాము కృషి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అనేక కొత్త కళాశాలలు రావడంతోపాటు పీయూలో కూడా విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లునర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కె ట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ, మాళవి, చంద్రకిరణ్, కరుణాకర్‌రెడ్డి, రవికాంత్, కృష్ణయ్య, వెంకటేశ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ డీకే అరుణ,
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
పీయూలో లా, ఇంజినీరింగ్
కళాశాలలు, బాలుర, బాలికల హాస్టళ్ల భవనాలకు శంకుస్థాపన


