సమష్టి కృషితోనే ఆర్టీసీ మనుగడ
కందనూలు: అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషిచేస్తేనే ఆర్టీసీ మనుగడ సాధిస్తుందని నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ గోపిడి అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ లోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రీజినల్ త్రై మాసిక ప్రగతి చక్ర అవార్డులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిత్ గోపిడి హాజరై మా ట్లాడారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు ఆర్టీసీకి వెన్నెముఖ లాంటివారని, అందరూ టీంవర్క్‌గా పనిచేసి మహబూబ్‌నగర్ రీజియన్‌ను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూ చించారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్, డిపో మేనేజర్ యాదయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
రెండు యూనిట్లలో
విద్యుదుత్పత్తి
ఽదరూరు/ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు మంగళవారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు కేవలం వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. విద్యుదుత్పత్తి నిమిత్తం 5, 598 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 24 క్యూసెక్కు లు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 496 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 6,508 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు లో 9.398 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దిగువ, ఎగువ జూరా ల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో కేవలం రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఎగువలో 1 యూనిట్లో 39 మెగావాట్ల ద్వారా 510.531 ఎంయూ, దిగువలో 1 యూనిట్లో 40 మెగావాట్ల ద్వారా 503.408 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 1013.939 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని ఎస్‌ఈ శ్రీధర్, డీఈ పవన్‌కుమార్ తెలిపారు.


