తెలంగాణ గోల్డ్ కప్‌లో ప్రతిభచాటాలి
● టీసీఏ జోనల్ ఇన్‌చార్జీ జీకే ప్రేమ్‌కుమార్
● ఉత్సాహంగా జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో వచ్చేనెలలో జరగనున్న తెలంగాణ గోల్డ్ కప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటాలని టీసీఏ జోనల్ ఇన్‌చార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీకే ప్రేమ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం శ్రీనివాసకాలనీలోని జీకే క్రికెట్ అకాడమీలో తెలంగాణ గోల్డ్‌కప్‌కు సంబంధించి జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీకే ప్రేమ్‌కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ.. తెలంగాణ గోల్డ్‌కప్ పోటీలు జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిల్లో జరుగుతాయని తెలిపారు. క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు ఫేరోజ్, దినేశ్‌యాదవ్, భాను తదితరులు పాల్గొన్నారు.
జిల్లా క్రీడాకారులు వివరాలు
మోతీలాల్ (కెప్టెన్), శ్రీరామ్‌రెడ్డి (వైస్ కెప్టెన్), జి.భాను, వినీత్, నందకిశోర్, అమర్ నాయక్, ఇమ్రాన్, అభిలాశ్, తరుణ్, యశ్వంత్, వంశీకృష్ణ, నితిన్‌నాయక్, ఆనంద్, ఉమేశ్, ఉదయ్, నితిన్‌రెడ్డి, స్టాండ్‌బైగా అఖిల్, కె.భాను, సాత్విక్.


