జాతీయ స్థాయి కల్చరల్ పోటీలకు ఎంపిక
జడ్చర్ల టౌన్: అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే జాతీయ స్థాయి కల్చరల్ పోటీలకు జడ్చర్ల ఉపాధ్యాయులు ప్రదర్శించిన లఘునాటిక భు వన విజయం ఎంపికై ంది. ఈనెల 6, 7 తేదీల్లో అఖిల భారత సివిల్ సర్వీ సెస్, తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వ ర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన పోటీల్లో జడ్చర్ల ఉపాధ్యాయు లు నాటి కలో శ్రీకృష్ణదేవరాయలుగా వెంకటరమణాచార్యులు, అల్లసాని పెద్దనగా కృష్ణమోహన్, నందితిమ్మనగా రాఘవేంద్రచారి, దూర్జటిగా రత్నశేఖర్, తెనాలి రామకృష్ణుడుగా భాస్కర్, రామరాజభూషణుడుగా శ్రీనివాసులు, పింగళి సూరనగా నర్సింహులు, అయ్యరాజు రామభద్రుడుగా నిమ్మయ్యగౌడ్, మాదయగారి మల్లనగా దార్ల రాఘవేంద్రచారి, నరసకవిగా నరేశ్‌గౌడ్, కవి శిఖామణిగా అనంతరాములు నటించారు. వీరి ప్రతిభకు ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలియజేస్తున్నాయి.


