పాలమూరు బాలికల జట్టు శుభారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: సంగారెడ్డిలో సోమవారం ప్రారంభమైన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లా బాలికల జట్టు శుభారంభం చేసింది. మొదటి లీగ్ మ్యాచ్‌లో జిల్లా జట్టు 125 పరుగుల తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు జట్టు నిర్ణీత 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 162 పరుగులు చేసింది. సిఽంధూజ 37 బంతుల్లో 77 పరుగులు, స్వాతి 36 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. జిల్లా బౌలర్లు సింధూజ 2, వైశాలి 1, నిహారిక 1 వికెట్లు తీశారు.
● ఉత్కంఠం సాగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జిల్లా జట్టు 12 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. జిల్లా బౌలర్లు సింధూజ 2, తేజశ్రీ 2, స్వాతి 1 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 12 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. జిల్లా క్రీడాకారిణులు స్వాతి 48 పరుగులు, వైశాలి 18 పరుగులు చేశారు.


