కార్మిక భద్రతపై అవగాహన కల్పించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీ టింగ్ హాల్‌లో కార్మిక సంక్షేమ బోర్డు– సామాజిక భద్రత పథకాలపై అవగాహన కల్పించే వాల్‌పోస్టర్ విడుదల చేశారు. జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షే మ బోర్డు (టీబీఓసీడబ్ల్యూడబ్ల్యూబీ) తరపున 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రధాన సంక్షేమ పథకాలు, ప్రమాద మరణ సహా యం రూ.10 లక్షలు, సహజ మరణ సహాయం రూ.2 లక్షలు, వైకల్య సహాయం రూ.5 లక్షల వర కు, పెళ్లి కానుక రూ.30 వేలు, ప్రసూతి సహాయం రూ.30 వేలు, హాస్పిటలైజేషన్ రిలీఫ్ రోజుకు రూ.300, నమోదు లేని కార్మికుల మరణాలకు ప్రత్యేక సహాయం రూ.50 వేలు ఉన్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సామాజిక భద్రతా పథకాలపై అవగాహన సదస్సు లు 10 రోజుల పాటు ఈ నెల 24 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, సహాయ కార్మిక కమిషనర్ ఎండీ అల్తాఫ్ పాల్గొన్నారు.


