ఆశావర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తోంది
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నాయని ఆశ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మండిపడ్డారు. తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ 4వ మహాసభల్లో భాగంగా రెండోరో జు జెండావిష్కరణ, ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ లేబర్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి కార్మికుల హక్కుల సాధనకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఆశా కార్మికులు ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. 2018లో సుప్రీం తీర్పు ప్రకారం కార్మికులందరికీ రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రోజుకు కనీస వేతనం రూ. 175 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విదేశాలు తిరిగేందుకు ప్రధాని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, కార్మికుల వేతనాలు పెంచేందుకు మాత్రం మనసు రావ డంలేదని ఆరోపించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.. అనేక రకాల కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఐటీ యూ ముందుందన్నారు. భవిష్యత్‌లో కార్మికుల పక్షాన మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆశా కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, అధికార ప్రతినిఽధి మాధవి, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు కిల్లెగోపాల్, దీప్లానాయక్, కురుమూర్తి, రాములు, లక్ష్మయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


