జిల్లా క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
● ప్రధాన కార్యదర్శిగా సంజీవ్ ముదిరాజ్
పాలమూరు: జిల్లా క్లబ్ ఎన్నికల ఫలితాలు సోమవారం సీనియర్ న్యాయవాది నాగేందర్‌రాజు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. శనివారం అర్ధరా త్రి వరకు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. జిల్లా క్లబ్ ప్రధాన కార్యదర్శిగా సంజీవ్ ముదిరాజ్‌కు 719ఓట్లు రాగా సమీప అభ్యర్థి మల్లు నర్సింహారెడ్డికి 299ఓట్లు వచ్చాయి. దీంతో మ ల్లు నర్సింహారెడ్డిపై సంజీవ్ ముదిరాజ్ 420 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఉపాధ్యక్షుడిగా సీమ నరేందర్(512ఓట్లు), సంయుక్త కా ర్యదర్శిగా ఎన్.శంకర్‌రెడ్డి(676ఓట్లు), క్రీడా సంయుక్త కార్యదర్శిగా ఆర్.రవీందర్‌రెడ్డి (912), కోశాధికారిగా జి.రామచంద్రారెడ్డి (650ఓట్లు) రావడంతో గెలుపొందినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఎంసీ సభ్యుల్లో బరిలో ఉన్న 12మందిలో నరేశ్‌రెడ్డికి 465, మోహన్‌రెడ్డికి 453, బాద్మి ధృవకు 432, ఆంజనేయులు కు 414, సతీశ్‌కుమార్‌కు 411ఓట్లు వచ్చాయి. దీంతో ఈసీ సభ్యులుగా వీరు గెలుపొందారు.


