
కురుమూర్తికి తరలివచ్చిన భక్తులు
చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపురం కురుమూర్తి స్వామి దర్శనానికి మంగళవారం అమావాస్యను పురస్కరించుకొని భకు ్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లో నిల్చున్నారు. మెట్లపై దీపాలు వెలిగిస్తూ గోవింద నామస్మరణ చేశారు. మెట్టుమెట్టుకు కొబ్బరి కాయలు కొట్టి స్వామి చెంతకు చేరారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారు చేసి స్వామికి సమర్పించారు. అనంతరం కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కనిపించింది. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఇబ్బంది కలుగ కుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లులు, భారతమ్మ, నాగరాజు, భాస్కర చారి ఏర్పాట్లను పరిశీలించారు.