
మళ్లీ తాగునీటికి కటకట
జిల్లాకేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ట్యాంకర్ల ద్వారా
తాగునీరు పట్టుకుంటున్న ప్రజలు
జడ్చర్ల పరిధిలోని నాగసాల వద్ద మిషన్ భగీరథ పథకం మెయిన్ పైపులైన్‌కు మరమ్మతు చేస్తుండటంతో జిల్లాకేంద్రంలోని 35 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆరు రోజులుగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలలో భాగంగా మున్సిపల్ అధికారులు నిత్యం 20 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండటంతో కొంత ఊరట కలిగింది. ధర్మాపూర్ వద్ద మరోసారి మిషన్ భగీరథ పైపులైన్‌కు ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో లీకేజీ ఏర్పడింది. దీన్ని మరమ్మతు చేయడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. దీంతో నగరంలో మంగళవారం నుంచి తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
– మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ

మళ్లీ తాగునీటికి కటకట