
కురుమూర్తి దారులకు మోక్షం!
● రోడ్డుకిరువైపులా ముళ్లపొదల
తొలగింపు
● భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవా లు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉ త్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరవుతారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కురుమూర్తి రహదారులన్నింటికీ అధికారు లు మరమ్మతులు చేపట్టారు. ముఖ్యంగా రహదారులకు ఇరువైపులా పెరిగిన ముళ్లపొదల తొలగింపు, గుంతల పూడ్చివేత తదితర పనులు చేపట్టారు. ఆదివారం అమ్మాపురం, దేవరకద్ర, అల్లీపురం, అడ్డాకుల మండలంలోని వర్నే ముత్యాలంపల్లి, రోడ్లకు జేసీపీలను పెట్టి ముళ్ల పొదలను తొలగిస్తున్నారు.
రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు
కురుమూర్తి స్వామి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఈ సంవత్సరం ముందస్తుగానే ఆలయ అధికారులు ఆర్‌అండ్‌బీ, పంచాయితీరాజ్ అధికారులకు ప్రతిపాదనలు పెట్టారు. అందుకు రెండుమూడురోజుల క్రితమే పంచాయతీరాజ్ నుంచి గ్రా మా ల్లో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. ఆర్‌అండ్‌బీ నుంచి నిధులు మంజూరు కా కున్న బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతుందన్న ఉద్దేశతో ప్రధాన రోడ్ల మరమ్మతులు చేపట్టారు.
పీఆర్ నిధులు మంజూరు
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని చిన్నచింతకుంట మండలంలోని పలు గ్రామా ల్లో స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు చేపడుతారు. అందుకు ఆయా గ్రామాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారు. అందుకు నిధులు కూడా మంజూరు చేశారు. చిన్నవడ్డేమాన్ నుంచి అప్పంపల్లి వరకు ఉద్దాల బాటకు రూ.40వేలు, అప్పంపల్లి నుంచి గ్రామ సమీపంలోని వాగు వరకు ఉద్దాల బాటకు రూ.లక్ష, తిర్మలాపురం సమీపం నుంచి గ్రామ సమీపంలోని వాగు వరకు ఉద్దాల బాటకు రూ.లక్ష, కురుమూర్తి గ్రామం నుంచి అమ్మాపురం వరకు దేవుని బాటకు రూ.1.20లక్షలు, అమ్మాపురం నుంచి గ్రామ వాగుకు, కురుమూర్తి గ్రామం వరకు రూ.75వేలు, ఉంధ్యాల నుంచి చిన్నచింతకుంట వరకు రూ.70వేలు, అమ్మాపురం నుంచి గూడూరు వరకు రూ.75వేలు, అప్పంపల్లి నుంచి అమ్మాపురం, రాజోళి బాటకు రూ.1.20లక్షలు, లాల్‌కోట నుంచి పల్లమరి వరకు రూ.60వేలు, మద్ధూర్ నుంచి గ్రామ వాగు వరకు రూ.30వేలు, కౌకుంట్ల నుంచి పొన్నకల్, రాచాల, ఇస్రంపల్లి వరకు రూ.2లక్షలు మంజూరు చేశారు. ఈ పనులను త్వరలోనే చేపట్టి పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రతిపాదనలు పెట్టిన పనులు
కురుమూర్తి స్వామి ఆలయానికి వచ్చే రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు ఆలయ అధికారులు పదిరోజుల క్రితం ఆర్‌అండ్‌బీ అధికారులకు ప్రతిపాదనలు పెట్టారు. మహబుబ్‌నగర్, వనపర్తి డివిజన్లకు సంబంధించి మహబుబ్‌నగర్ జిల్లాకు చెందిన దేవరకద్ర నుంచి అమ్మాపురం, ఆత్మకూర్ వరకు, అల్లిపురం నుంచి లాల్‌కోట క్రాస్ రోడ్డు వరకు, దేవరకద్ర నుంచి తిర్మలాపురం, అప్పంపల్లి వరకు, దేవరకద్ర నుంచి కౌకుంట్ల, వెంకంపల్లి, కురుమూర్తి దేవస్థానం వరకు, వనపర్తి డివిజన్ చెందిన లక్ష్మీపురం నుంచి కొత్తకోట వరకు, కొన్నూర్ నుంచి నెల్విడి వరకు, మదనాపురం నుంచి కురుమూర్తి దేవస్థానం వరకు మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహబుబ్‌నగర్ డివిజన్ అధికారులు మాత్రం ఆదివారం పనులు చేపట్టారు. వనపర్తి డివిజన్‌వారు ఇంకా పసనులు చేపట్టలేదు.