
కారు ఇంజిన్‌లో మంటలు
జడ్చర్ల: స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ కారు ఇంజన్‌లో మంటలు రావడంతో డ్రైవర్ వెంటనే గమనించి కారును నిలిపి వేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని పోలేపల్లి సెజ్ నుంచి జడ్చర్ల సిగ్నల్‌గడ్డ వైపు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంజన్‌లో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ కారును వెంటనే నిలిపి పరిశీలిస్తుండగానే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే చుట్టుపక్కల వారు నీటిని చల్లి మంటలను ఆర్పారు. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.
పాముకాటుతో
గొర్రెల కాపరి మృతి
నవాబుపేట: మండలంలో ని కూచూర్‌లో గొర్రెల కా పరి పాము కాటుతో మృతి చెందినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఈ ఘటన వివ రాలు ఇలా.. కూచూర్‌కు చెందిన చిన్న మల్లయ్య (55) శనివా రం గొర్రెలను ఎప్పటి మాదిరిగా మేతకు తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లో పాము కాటువేయగా అంతగా పట్టించుకోలేదు.ఏదో పురుగు అని ధీమాగా ఉన్నాడు.తీరా ఇంటికి వచ్చే సరికి విషం ఎక్కడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంత రం బాధిత కుటుంబ సభ్యులు అస్పత్రికి తరలించే లోగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
చోరీకి పాల్పడిన
దొంగకు దేహశుద్ధి
కొత్తపల్లి: తాగిన మైకంలో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి గమనించిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కొత్తపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మద్దూరు మండలంలోని పెద్దిరిపాడు తండాకు చెందిన రాజునాయక్ కొత్తపల్లిలోని ప్రధాన చౌరస్తా వద్ద శివాలయంలో హుండీ పగలగొట్టి అందులో ఉన్న రూ.1,450 నగదు అపహరించడంతోపాటు ఆలయం ముందున్న బోరు మోటరు కేబుల్ వైరును కటింగ్‌బ్లేడ్‌తో కట్ చేస్తుండగా గ్రామస్తులు గమనించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజునాయక్ తాగుడుకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో అప్పటినుంచి తాగడానికి డబ్బుల్లేక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కారు ఇంజిన్‌లో మంటలు

కారు ఇంజిన్‌లో మంటలు