
ఉత్సాహంగా యోగాసన క్రీడా ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ నిరంతరం యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. యోగా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటాలని కోరారు. ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.బాల్‌రాజు మాట్లాడుతూ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 130 మంది క్రీడాకారులు హాజరయ్యారని, ఎంపికై న వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి శ్రీనివాసులు, శరణ్య, మణికంఠ, పవన్‌కుమార్, కె.వెంకటేశ్ పాల్గొన్నారు.
కిక్‌బాక్సింగ్ లీగ్‌లో ప్రతిభ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి వరకు జిల్లా స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మితా ఖేలో ఇండియా వుమెన్స్ కిక్‌బాక్సింగ్ సిటీ లీగ్‌లో జిల్లా క్రీడాకారిణులు ప్రతిభచాటారు. పాయింట్ ఫైట్, లైట్, మ్యూజికల్ ఫాం విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహబూబ్‌నగర్ జిల్లా క్రీడాకారిణులు 57 పతకాలు సాధించారు. ఇందులో 31 బంగారు పతకాలు, 15 రజతం, 11 కాంస్య పతకా లు సాధించి లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచి సత్తాచాటారు. క్రీడాకారిణులు ప్రతిభ చాటి పతకాలు సాధించడంపై జిల్లా స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ అధ్య క్షులు కె.రవికుమార్, ప్రధాన కార్యదర్శి రవినాయక్‌లు అభినందించారు. ప్రథ మ స్థానంలో నిలిచిన వారు త్వరలో జరిగే జోనల్ సెలక్షన్స్‌కు ఎంపికవుతారని తెలిపారు. జోనల్ సెలక్షన్స్‌లో పతకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

ఉత్సాహంగా యోగాసన క్రీడా ఎంపికలు