
వారోత్సవాలను జయప్రదం చేయాలి
మహబూబ్ నగర్ న్యూటౌన్: ఈ నెల 10 నుంచి 17 వరకు జరుగుతున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాములు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లి గోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అశోక్ టాకీస్ చౌరస్తా నుంచి గడియారం చౌరస్తా వరకు డప్పుల ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వామ్య పీడనకు నైజాం నవాబు పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పుట్టుకొచ్చిందన్నారు. ఈ పోరాటంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏమాత్రం లేదని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ముస్లింలపై హిందువులు విజయం సాధించినట్లు బీజేపీ దాని అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రచారం చేసుకుంటున్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి దిగజారులు మాటలతో ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కురుమయ్య, టీపీఎస్‌కే జిల్లా కార్యదర్శి కురుమూర్తి, నాయకులు పద్మ, మాణిక్యం, చంద్రకాంత్, రాజ్‌కుమార్, శివలీల పాల్గొన్నారు.