
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నల్లగొండ జిల్లాలో ఈనెల 14న ప్రారంభమయ్యే 12వ రాష్ట్రస్థాయి సీనియర్స్ యోగాసన పోటీలకు ఎంపికైన ఉమ్మడి జిల్లా క్రీడాకారులను శనివారం సాయంత్రం జిల్లా ప్రధాన స్టేడియంలో అభినందించారు. 18–21 ఏళ్లలోపు విభాగంలో నందిని, కావేరి, అంకిత, పూజ, శైలజ, 21–25 ఏళ్లలోపు విభాగంలో స్వప్న, శ్వేత, సాగర్, మధు, ఆకాష్, 25–30 ఏళ్లలోపు విభాగంలో బాలమణి, 35–40 ఏళ్లలోపు విభాగంలో వెంకటేష్ ఉన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగా సంఘం అధ్యక్షుడు కె.రాములు, కార్యదర్శి ఆర్.బాలరాజు, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తి గౌడ్, యోగా సంఘం ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కిషన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
● నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..
గండేడ్: ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయి చివరకు శనివారం చెట్టుకు శవమై కనిపించాడు. మృతదేహం పూర్తిగా కుళ్లిన దశలో ఉంది. వివరాల్లోకి వెళితే గండేడ్ మండలంలోని వెన్నాచేడ్ గ్రామానికి చెందిన నీరటి రామయ్య (58) నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. భార్య చెన్నమ్మ పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. శనివారం వెన్నాచేడ్ దోశోని కాల్వ సమీపంలో ఓ మృతదేహం కనిపించింది. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం ఎవరిదని గుర్తించడానికి కష్టంగా మారింది. భరించరాని దుర్వాసన వెదజల్లు తుండడంతో దాని దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే కనిపించకుండా పోయిన రామయ్య భార్య చెన్నమ్మకు ఓ మృతదేహం గ్రామ సమీపంలో ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో ఆమె వచ్చి బట్టలు, ఇతర ఆనవాళ్లు గుర్తించి మృతుడు తన భర్త రామయ్యగా గుర్తించింది. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.